Monday, 5 September 2016

రాంగోపాల్ వర్మ గారి కామెంట్ పై సూచన

         ఉపాధ్యాయులందరికీ నమస్కారములు. నేడు( 5-9-2016 ) ట్విట్టర్ నందు దర్శకుడు రాంగోపాల్ వర్మ గారు చేసిన వ్యాఖ్యలపై ఉపాధ్యాయులందరూ మనస్తాపం చెందుతున్నారు. కానీ అలా మనస్తాపం చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే తన జీవిత విశేషాలను వర్మ గారు తెలియచేసిన అంశంలోనే ఉపాధ్యాయులను గౌరవించాడు. ఎందుకంటే తనకు విధ్యాబ్యాసం ఉపాధ్యాయులు నేర్పకుంటే ఈ రోజు తను ఉన్న స్తాయిలో ఉండేవాడు కాదు అని అతనికి తెలుసు. అదెలాగంటే గూగుల్ నందు ఎవరైనా విషయాలను తెలుసుకోవాలన్న వారికి అక్షర జ్ఞానం తెలిసుండాలి. అది ఇతరులు నేర్పిస్తేనే వస్తుంది. అక్షర జ్ఞానం నేర్పేది తల్లితండ్రులైనా లేక ఇతరులు ఎవరైనా వారిని మొదటగా ఉపాధ్యాయుడుగానే పరిగణిస్తాం. మరి అలా ఎవరు నేర్పనిదే జ్ఞానాన్ని ఎలా పొందాడో ఆయనకే తెలుసో లేదో? ఎందుకంటే మన పాఠశాలల్లో M.R విద్యార్థులు ఉంటారు. అలాంటి కోవకు చెందినవారే అప్పుడప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఉపాధ్యాయులు బోదించక పొతే తనకు ఉన్న విద్యార్హతలు ఎలా పొందాడో మరి? తనకు కూడా ఒక కుటుంబం ఉంటుంది కదా? మరి తన కుటుంబ సభ్యులను పాఠశాలల్లో చదివిస్తున్నాడో లేదో మరి? ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు మరచిపోవడానికి కామిక్ పుస్తకాలు చదివేవాడినని చెప్పాడు. అంటే మన ఉపాధ్యాయులు అతని మెదడులో మరచిపోలేనంతగా పాఠాలను భోదించారు. ఇది ఖచ్చితంగా సంతోషించాల్సిన విషయం. మన ఉపాధ్యాయులు తమ వృత్తిని తాము సంపూర్ణంగా నెరవేర్చారు అని. అతను సాదారణంగా విస్కీ తాగనని అన్నాడు. కానీ టీచర్స్ విస్కీ బ్రాండ్ మాత్రం ఇష్టమని చెప్పాడు. దీన్ని బట్టి మనకు అర్థమైనది ఏమంటే అతను ట్వీట్ చేస్తున్నపుడు అతను ఏం చేస్తున్నాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చేతి వృత్తులు నేర్పే వారు కూడా అక్షర జ్ఞానం లేనిది ఏ విషయాన్ని ఇతరులకు నేర్పలేరు. సరే ఏది ఏమైనప్పటికీ ఇతను చాలా సందర్బాలలో ఇలాగే సందోర్బోచితంగా వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం అతనికి అలవాటు. దానికి మనం ఎక్కువగా స్పందిస్తే అతనికి ఎక్కడలేని పబ్లిసిటీ వస్తుంది,దానికోసమే అతను ఇలాంటివి అప్పుడప్పుడు చేస్తుంటాడు. ఉపాధ్యాయులమైన మనకు ఓర్పు నేర్పు ఉన్నవారం. కాబట్టి మనం సంయమనం పాటించాలని కోరుకుంటున్నాను.
సూచన : ఎవరైనా నా నుండి మీకు ఒకరికే వాట్సాప్ మెసేజ్ లు పొందాలనుకుంటే మీరు నా నంబరును మీ మొబైల్ నందు సేవ్ చేసుకుంటే ఆటోమాటిక్ గా మెసేజెస్ ను పొందగలరు. ఒక వేల నా నుండి మెసేజెస్ ను పొందకూడదు అనుకుంటే నా నంబరును డిలీట్ చేయగలరు. అప్పుడు మీకు నా మెసేజెస్ రావు. నేను బ్రాడ్కాస్ట్ గ్రూప్ మెసేజెస్ పంపిస్తుంటాను. నా నంబరు 9550660855. అలాగే మీరు డైరక్ట్ గా నా బ్లాగ్ నుండి కూడా ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. నా బ్లాగ్ అడ్రసు     http://apysrtfknl.blogspot.in   
రమేష్, వై.యస్.ఆర్.టీచర్స్ ఫెడరేషన్,కర్నూలు.

అప్పల ప్రసాద్ గారి ప్రసంగం

అందరికీ నమస్కారం. శ్రీకాకుళం నందు శ్రీ అప్పల ప్రసాద్ గారు IMPACT కార్యక్రమం నందు మన భారత దేశం యొక్క ఔన్నత్యాన్ని వివరించిన తీరు అమోఘం. ...