అందరికీ నమస్కారం. ప్రస్తుతం జరగబోవు ఉపాధ్యాయ బదిలీల నందు APeKX వెబ్ పోర్టల్ నందు రిజిస్టర్ అయిన ఉపాధ్యాయులకు 1 పాయింటు
కేటాయించారు. కావున ప్రతి ఒక ఉపాధ్యాయుడు కూడా APeKX వెబ్
పోర్టల్ నందు రిజిస్టర్ చేసుకోవలసినదిగా నేను కోరుచున్నాను. ఇప్పటికే
చాలా(వేళల్లో) మంది రిజిస్టర్ అయి ఉన్నారు. కావున దయచేసి స్మార్ట్ ఫోన్ లేని
వారికి మీరు సహాయం చేయవలసినదిగా కోరుచున్నాను.
APeKX వెబ్ పోర్టల్ నందు రిజిస్టర్ చేసుకునే విధానం
గూగుల్ నందు APeKX అని
టైపు చేయండి. క్రింద వచ్చిన వాటిని గమనించండి.
అక్కడ వచ్చినవాటి నందు Teachers
Registration అనే దానిని క్లిక్
చేయండి.
PHONE NUMBER అనే బాక్స్ లో మీరు డిపార్ట్మెంట్ కు
ఇచ్చిన మొబైల్ నంబరును ఎంటర్ చేయండి.
తరువాతి బాక్స్
నందు మీకు ఇష్టమైన మరచిపోనటువంటి పాస్వర్డ్ ను ఆరు అక్షరాలు అయిన లేక ఆరు అంకెలు
అయినా లేక రెండు కలిసి అయినా ఆరుకు తగ్గకుండా ఎంటర్ చేయండి.
తరువాత సెక్యురిటి
బాక్స్ నందు మీకు అక్కడ కనపడుతున్న అంకెలను ఎంటర్ చేయండి. తరువాత SUBMIT బటన్ ను నొక్కండి. మీకు వెంటనే అందులో రిజిస్టర్
అయిపోతుంది. తరువాత మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఎదో క్రింది బాక్స్ లో రాసి అప్డేట్
చేయండి. ఇంతటితో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. తరువాత మీరు అన్ని సబ్జెక్ట్ ల నందు
విషయాలు తెలుసుకోవచ్చు,అలాగే మీరు ఇతర ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు కూడా
సలహాలు ఇవ్వవచ్చు, సందేహాలు తీర్చవచ్చు. అలాగే మీకున్న సందేహాలు కూడా
తీర్చుకోవచ్చు.
ఈ అంశం మీకు
నచ్చ్సితే ఇతరులకు కూడా పంపగలరు.
మీకందరికీ
ధన్యవాదములు.
రమేష్,వై.యస్.ఆర్.టీచర్స్
ఫెడరేషన్, కర్నూలు.