Saturday, 25 April 2026

AIMS , MANGALAGIRI

 *మీ జేబుకు చిల్లు పడకుండా, ప్రాణం నిలబెట్టే దేవాలయం: మంగళగిరి ఎయిమ్స్*

 

*"అమ్మా, ఆపరేషన్‌కు 5 లక్షలు కావాలి" అనే మాట ఇక వినబడదు. ఎందుకంటే మన మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది.*


ఒక పేద తండ్రి కూతురి పెళ్లి కోసం దాచిన డబ్బు, ఒక తల్లి కొడుకు చదువు కోసం కూడబెట్టిన సొమ్ము – ఒక్క జబ్బు పేరు చెప్పి కార్పొరేట్ హాస్పిటల్ లాగేసుకుంటుంది. ఇక ఆ బాధలు వద్దు. 


*విజయవాడ-గుంటూరు మధ్య, 183 ఎకరాల పచ్చని ప్రాంగణంలో, కేంద్ర ప్రభుత్వం రూ. 1610 కోట్లతో కట్టించిన మన ఎయిమ్స్* మనందరి కోసం ఎదురుచూస్తోంది.


*మీరు ఎందుకు వెంటనే వెళ్లాలి? ఇది చదవండి, మీ కళ్ళు మీరే నమ్మరు.*


*1. డాక్టర్ ఫీజు ఎంత అంటే – ఒక్క టీ ఖరీదు కూడా కాదు: కేవలం ₹10/-*


అవును సార్, కేవలం పది రూపాయలు. ఆ ఒక్క టికెట్‌తో మీరు జనరల్ ఫిజీషియన్ దగ్గర, కీళ్ల డాక్టర్ దగ్గర, కంటి డాక్టర్ దగ్గర, ENT డాక్టర్ దగ్గర, పంటి డాక్టర్ దగ్గర, చర్మవ్యాధుల డాక్టర్ దగ్గర – అందరి దగ్గరా చూపించుకోవచ్చు. 


*బయట ఒక స్పెషలిస్ట్ ఫీజు ₹500 నుండి ₹1500. ఇక్కడ మాత్రం ₹10.* ఆలోచించండి, మీ 490 రూపాయలు మిగిలినట్టే.


*2. బయట ₹10,000 అయ్యే టెస్టులు ఇక్కడ ₹600 లోపే*


మీరు షాక్ అవుతారు, కానీ ఇది నిజం. కార్పొరేట్ హాస్పిటల్ బిల్లు చూసి గుండె ఆగిపోయే పరిస్థితి ఇక్కడ ఉండదు.

(మీకు బయట అయ్యే ఖర్చు - ఎయిమ్స్‌లో అయ్యే ఖర్చు = మీకు మిగిలేది)

కంప్లీట్ బ్లడ్ టెస్ట్: ₹800- ₹135 =₹665 

లివర్ & కిడ్నీ టెస్ట్: ₹2000- ₹225 + ₹225 = ₹1550

ECG + చెస్ట్ X-Ray: ₹700 - ₹50 + ₹60 = ₹590

థైరాయిడ్ టెస్ట్: ₹900 - ₹200 = ₹700

మామ్మోగ్రఫీ: ₹4000 - ₹630 = ₹3370

*ఒక్కరోజులో ₹6000 కు పైగా ఆదా.* ఆ డబ్బుతో మీ పిల్లలకు ఒక నెల సరుకులు వస్తాయి సార్.


*3. ఇది హాస్పిటల్ కాదు, ఫైవ్ స్టార్ హోటల్*


183 ఎకరాల్లో పచ్చదనం మధ్య ఉన్న హాస్పిటల్. గాలి, వెలుతురు, పరిశుభ్రత. బాత్‌రూమ్ నుండి బెడ్ వరకు అద్దంలా మెరుస్తూ ఉంటుంది. క్యాంటీన్‌లో వేడి వేడి అన్నం, కూర, పప్పు, పెరుగు అన్నీ కలిపి *కేవలం ₹75.* బయట హోటల్లో ఒక ప్లేట్ మీల్స్ కూడా రాదు ఈ రేటుకి.


*4. వెళ్లడం చాలా ఈజీ – జేబుకు భారం కాదు*


విజయవాడ నుండి, మంగళగిరి బస్ స్టాండ్ నుండి డైరెక్ట్ బస్సులు. *బస్ టికెట్ ₹10 మాత్రమే.* ఆటో అయినా ₹30-₹50. ఉదయం 9 గంటలకు వెళ్తే, టెస్టులతో సహా అన్నీ అయిపోయి మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి వచ్చేస్తారు. ఆఫీసుకు సెలవు పెట్టాల్సిన పని లేదు.


*5. 960 బెడ్లు, 600 మంది డాక్టర్లు – మీ కోసమే*


మనలాంటి సామాన్యులకు వైద్యం అందాలని 24 గంటలు అంకితభావంతో పనిచేస్తున్నారు. తెలంగాణ నుండి వచ్చినా సరే, ఆధార్ కార్డు ఉంటే చాలు. తెలుగులోనే మాట్లాడతారు, ప్రేమగా ట్రీట్‌మెంట్ ఇస్తారు.


*ఇంకా ఆలోచిస్తున్నారా?*


మీ పక్కింటి వాళ్లు, మీ బంధువులు, మీతో పనిచేసే తోటి వర్కర్స్ – ఎవరైనా జబ్బుతో బాధపడుతున్నారా? లక్షలకు లక్షలు అప్పు చేస్తున్నారా? వెంటనే ఈ మాట చెప్పండి: *"ఒక్కసారి మంగళగిరి ఎయిమ్స్‌కు వెళ్లిరా."*


మీరు ఫార్వర్డ్ చేసే ఈ ఒక్క మెసేజ్ ఒక కుటుంబాన్ని అప్పుల ఊబి నుండి బయటకు లాగవచ్చు. ఒక తల్లి కన్నీళ్లు తుడవవచ్చు. ఒక నాన్న గుండె ధైర్యం నింపవచ్చు.


*ఇది ప్రభుత్వ హాస్పిటల్ అని చులకన చేయకండి. ఇది మన ఆస్తి. మన కోసం కట్టిన ప్రపంచ స్థాయి హాస్పిటల్. దీన్ని పూర్తిగా వాడుకుందాం.*


*అడ్రస్:* ఎయిమ్స్ హాస్పిటల్, మంగళగిరి, గుంటూరు జిల్లా.  

*ఓపీ టైమ్:* ఉదయం 9 నుండి. టికెట్ ₹10.  

*న్యూరాలజీ:* త్వరలో పూర్తి స్థాయిలో ప్రారంభం.


*ఈరోజే మీ ఫోన్‌లోని 10 గ్రూపులకు పంపండి. పుణ్యం మీకు, మేలు 10 మందికి.*


*ఇట్లు,*  

*మీ శ్రేయోభిలాషి*


*విజయవాడ,ఆంధ్రప్రదేశ్ ,అమరావతి*

---

DA ల బకాయిల వివరాలు

 *💰D.A.ల గురించి సరియైన సమాచారం* 1) 27.248% to 30.392% 01.07.2018 నుండి 31.12.2020 వరకు రావలసిన 30 నెలల బకాయిలు మూడు బిల్లుల రూపంలో సమర్పి...